బరువు తగ్గేందుకు అవిసెగింజలను ఇలా తీసుకోండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు అవిసెగింజలను వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు.
అవిసెగింజలను పొడి చేసి.. వేడి నీళ్లల్లో కలిపి.. కొంచెం నిమ్మకాయ రసం కలిపి రెగ్యూలర్‌గా తాగిలి. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
అవిసె గింజలు ఓ గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయాన్నే తాగాలి. రోజూ ఇలా తాగితే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
అవిసె గింజలను నూనె లేకుండా వేయించుకుని.. వాటిని స్నాక్స్‌గా లేదంటే సలాడ్స్‌తో కలిపి నేరుగా తీసుకోవచ్చు. కరకరలాడుతూ ఉండే ఈ ఫ్లాక్స్ సీడ్స్ బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తాయి.
ఓ గిన్నెలో యోగర్ట్ తీసుకోండి. దానిలో కొన్ని పండ్లు వేసుకుని.. పైన అవిసెగింజలు వేసుకోండి. వీటన్నింటినీ కలిపి.. బ్రేక్‌ఫాస్ట్‌గా లేదంటే స్నాక్‌గా తీసుకోవచ్చు. ఇవి బరువును తగ్గిస్తాయి. హెల్తీ కూడా.
రెండు టేబుల్ స్పూన్ల అవిసెగింజలను పెరుగులో కలిపి మీకు ఇష్టమైన ఫ్రూట్స్‌తో కలిపి బ్లెండ్ చేసి స్మూతీలుగా చేసుకుని తాగవచ్చు.
అవిసెగింజల పొడిని.. దాల్చిన చెక్క పొడిని కలిపి టీగా చేసుకుని తాగవచ్చు. ఈ రెండూ కూడా బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
ఇలా అవిసెగింజలను రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. బీపీ, షుగర్ కూడా అదుపులో ఉంటాయి.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.