ఉల్లిపాయను జుట్టుకి ఇలా అప్లై చేస్తే స్ట్రాంగ్ అవుతుంది.. రాలదు
జుట్టు రాలడానికి వివిధ కారణాలు ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు రాలకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉల్లిపాయను కొన్ని టెక్నిక్స్‌తో అప్లై చేస్తే జుట్టు రాలదు. ఎలా అంటే..
ఉల్లిపాయ రసాన్ని తీసి.. దానిలో అల్లం రసం కలిపి.. ఆముదంతో కలిపి నూనె చేసుకోవాలి. ఈ నూనెను రెగ్యూలర్‌గా అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ముందుగా ఉల్లిపాయను చిన్నముక్కలుగా కోసి మిక్సీలో వేసుకోవాసి. ఇప్పుడు తొక్క తీసేసిన అల్లాన్ని దానిలో వేయాలి. ఈ రెండిటినీ కలిపి మిక్సీ చేయాలి.
ఈ పేస్ట్‌ని గట్టిగా పిండితే ఉల్లి, అల్లం రసం వస్తుంది. ఇప్పుడు దానిలో ఆముదం నూనె వేసుకోవాలి. ఈ రెండిటినీ బాగా కలిపి స్ప్రే బాటిల్లో తీసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని.. జుట్టుకి అప్లై చేసే ముందు హెయిర్‌ని కాస్త వెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆముదం మిశ్రమాన్ని జుట్టుపై స్పై చేస్తూ.. మునివేళ్లతో మసాజ్ చేయాలి. ఇలా జుట్టు పొడవు చేయాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత స్కాల్ప్, జుట్టుని బాగా మసాజ్ చేసి.. అరగటం అలాగే ఉంచేయాలి. అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
నెలలో రెండు లేదా మూడుసార్లు ఇలా చేస్తే జుట్టురాలడం కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా జుట్టు స్ట్రాంగ్‌గా మారి.. పొడుగు పెరుగుతుంది.
ఈ స్ప్రే వల్ల పొడి జుట్టు దూరమవుతుంది. నిర్జీవమైన హెయిర్ కూడా షైనీగా మారుతుంది. కుదుళ్ల నుంచి జుట్టు స్ట్రాంగ్‌గా మారి పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.