హోమ్ రెమిడీస్

మెడ చుట్టు నల్లగా ఉంటుందా? ఈ టిప్స్​తో వదిలించుకోండి

Published by: Geddam Vijaya Madhuri

కారణాలు ఇవే

కాలుష్యం వల్లనో.. శ్రద్ధ పెట్టకపోవడం వల్లనో.. హెల్త్ విషయాల వల్లనో చాలామందికి మెడదగ్గర నల్లగా అయిపోతుంది. దీనిని కొన్ని సింపుల్ చిట్కాలతో వదిలించుకోవచ్చు తెలుసా?

టిప్ - 1

నిమ్మరసంలో పంచదారను కలిపి.. మెడపై మృదువుగా స్క్రబ్ చేయాలి. రెండు నుంచి మూడు నిమిషాలు స్క్రబ్ చేసి.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

టిప్ - 2

యోగర్ట్​లో పసుపు కలిపి మెడకు ప్యాక్​గా వేసుకోవాలి. దీనిని 20 నిమిషాలు ఉంచి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

టిప్ - 3

కీరదోస జ్యూస్​ను మెడపై నల్లగా ఉన్న ప్రాంతంలో కాటన్ దూదితో అప్లై చేయాలి. దీనిని 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోవాలి.

టిప్ - 4

కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. దానిని మెడపై రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి. నిద్రలేచిన తర్వాత ఉదయాన్నే దాన్ని క్లీన్ చేసుకోవాలి.

టిప్ - 5

ఓట్​మీల్​లో తేనెను కలిపి ముఖానికి, మెడకు కూడా అప్లై చేయాలి. దీనిని పావుగంట అలాగే ఉంచాలి. ఇది స్క్రబ్​ వలె నలుపుదనాన్ని పోగొట్టి.. మృదువైన, గ్లోయింగ్ స్కిన్​ ఇస్తుంది.

టిప్ - 6

బేకింగ్ సోడాలో నీరు వేసి కలిపి పేస్ట్​లా తయారు చేసుకోవాలి. దీనిని మెడకు అప్లై చేసి 5 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

టిప్ - 7

అరటిపండు గుజ్జులో తేనెను కలిపి మెడభాగంపై అప్లై చేయాలి. దీనిని 20 నిమిషాలు ఉంచి వాష్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ముఖంపై అప్లై చేసినా మంచిదే.

మరిన్ని

అలోవెరా జెల్, టోమోట్ జ్యూస్​లను కూడా అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. వీటిని రెగ్యూలర్​గా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సూచనలు ఫాలో అయితే మరిన్ని మంచి ఫలితాలుంటాయి.