పరగడుపునే నెయ్యి తినడం వల్ల కలిగే లాభాలివే అమ్మో నెయ్యి తింటే ఫ్యాట్ అయిపోతామంటూ కొందరు దాని జోలికి కూడా వెళ్లరు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా రోజూ దానిని తీసుకుంటారు. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని రెగ్యూలర్గా తీసుకుంటో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి. ముఖ్యంగా పరగడుపునే నెయ్యి తీసుకుంటే చాలామంచిదంటున్నారు. జీర్ణసమస్యలున్నవారికి ఇది మంచి ఔషదంగా పనిచేస్తుంది. మలబద్ధక సమస్య పోతుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. రక్తప్రసరణ పెరిగి చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుంది. కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని కలిపి తాగితే చాలామంచిది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి హెల్తీగా, యాక్టివ్గా ఉండేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.