మోమోలు బయట తింటే వాళ్లు ఎలా చేస్తారో అనే భయముంటుంది. పైగా ధర కూడా ఎక్కువే. అయితే ఇంట్లోనే వాటిని టేస్టీగా చేయగలిగే సింపుల్ రెసిపీ ఇక్కడుంది. ఆల్ పర్పస్ ఫ్లోర్ రెండు కప్పులు, బేకింగ్ పౌడర్ పావు టీస్పూన్, పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. చికెన్ మీట్ 1 కప్పు, 1 ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్. జీలకర్ర పొడి 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, ఉప్పు, పెప్పర్ రుచికి తగినంత తీసుకోవాలి. చికెన్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తురుము, అల్లం పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడులు, ఉప్పు, పెప్పర్ వేసి కలపాలి. ముందుగా పిండిలో సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. నెయ్యి వేసి పిండిని మిక్స్ చేసి 5 నిమిషాలు ఉంచాలి. అనంతరం చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీగా చేసుకోవాలి. దానిలో రెడీ చేసుకున్న స్టఫ్ పెట్టుకోవాలి. స్టఫ్ బయటకి రాకుండా దాని అంచులను కలపాలి. వీటిని డిఫరెంట్ స్టైల్స్‌లో చేయవచ్చు. వీటిని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. అంతే వేడి వేడి మోమోలు రెడీ. చట్నీ లేదా సాస్‌తో కలిపి సర్వ్ చేయొచ్చు.