చెరకు రసం తియ్యగా ఉంటుంది. అంతేకాకుండా దీనలో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలు స్వీట్‌గా ఉండేవాటిని ఎక్కువగా ఇష్టపడతారు. చెరకు రసాన్ని కూడా అంతే ఇష్టంగా తాగుతారు. ఇంతకీ చెరకు రసాన్ని పిల్లలకు పట్టించవచ్చా? నిపుణుల సలహాలు ఏంటి? చెరకు రసంలో విటమిన్స్ ఏ, సి, ఈతో పాటు.. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీనిలోని సర్కోస్ పిల్లల ఎనర్జీ లెవెల్స్‌ను బాగా పెంచుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను దీనిలోని ఫైబర్ దూరం చేస్తుంది. కుదిరితే దానిలో కాస్త నీళ్లు వేసి డైల్యూట్ చేసి ఇస్తే మరీ మంచిది. కొందరు పిల్లలకు ఇది అలెర్జీ రియాక్షన్స్ ఇస్తుంది కాబట్టి కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. పిల్లలకు దీనిని తాగించాలనుకున్నప్పుడు క్యాన్డ్ కాకుండా.. ఫ్రెష్, హైజీన్ చెరకు రసం ఇవ్వాలి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ ఇవ్వకుండా లిమిటెడ్‌గా ఇస్తే మంచి ఫలితాలుంటాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది. (Images Source : Freepik, Envato)