నీటిలో, గాలిలో నడిచే కారు తీసుకొచ్చిన కియా - లాంచ్ ఎప్పుడంటే? దక్షిణ కొరియాకు చెందిన కియా కార్లకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం కియా ఆఫ్ రోడింగ్‌లోకి కూడా అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తుంది. లాస్ ఏంజెల్స్ ఆటో షోలో కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాన్‌ను ప్రదర్శించారు. కియా పీవీ5 డబ్ల్యూకేఎన్‌డీఆర్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ వ్యాన్‌ను కంపెనీ రూపొందిస్తుంది. అన్ని రకాల కండీషన్లలో ఇది తిరుగుతుందని కంపెనీ అంటోంది. ఈ కాన్సెప్ట్ వ్యాన్‌లో హైడ్రో టర్బైన్ చక్రాలను కంపెనీ అందించింది. ఈ హైడ్రో టర్బైన్ వీల్స్ గాలి నుంచి నీటి నుంచి కరెంటును జనరేట్ చేసి వ్యాన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వ్యాన్‌లో లివింగ్ రూం, బెడ్ రూం, కిచెన్, వర్క్ స్టేషన్ కూడా ఉన్నాయి. దీని ద్వారా బరువైన వస్తువులను, ఇతర వాహనాలను కూడా తీసుకురావచ్చు.