మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న లగ్జరీ కారు ఇదే! భారతదేశంలో క్రమంగా లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. మనదేశంలో లగ్జరీ కార్లను విక్రయించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటి ధర కూడా చాలా ఎక్కువ. మెర్సిడెస్ బెంజ్ కార్లు మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. మెర్సిడెస్ కార్లలో మేబ్యాక్ జీఎల్ఎస్ అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ.3.35 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇందులో 4.0 లీటర్ వీ8 ఇంజిన్‌ను అందించారు. ఇది 550 బీహెచ్‌పీ, 730 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది కేవలం 4.9 సెకన్లలోనే అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ కారులో బర్మస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టంను అందించారు. దీనికి ఉన్న అన్ని చక్రాల్లో 4 మాటిక్ సిస్టంను కూడా చూడవచ్చు. రేంజ్ రోవర్ ఎస్వీ, బెంట్లే బెంటేగా, రోల్స్ రాయిస్ కులినన్ కార్లతో ఇది పోటీ పడుతోంది.