ప్రపంచంలో మొదటి బుల్లెట్ బైక్ ఎప్పుడు తయారు చేశారు? రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీని ఉత్పత్తి 1932లో ప్రారంభం అయింది. 1932లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎండీ ఫ్రాంక్ వాకర్ స్మిత్ ఈ బైక్‌ను రూపొందించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక బుల్లెట్ బైక్స్‌ను ఆర్మీ సైనికులు ఉపయోగించేవారు. భారత ప్రభుత్వం సైన్యానికి 800 బైక్‌లను అప్పట్లో ఇచ్చింది. సైన్యంలో చేరడంతో బుల్లెట్ బైక్‌కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం మనదేశంలో బుల్లెట్ ఎనిమిది కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 349 సీసీ సింగిల్ సిలెండర్ ఎస్ఓహెచ్‌సీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అందించారు. దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. 37 కిలోమీటర్ల మైలేజీని ఇది అందించనుంది.