టాటా నెక్సాన్ ఎంత మైలేజీని అందిస్తుంది? మనదేశంలో ఉన్న పాపులర్ కార్లలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. సేఫ్టీ పరంగా ఈ కారు ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఏకంగా 44 లీటర్లుగా ఉంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ 17.57 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 17.05 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వనుంది. దీని డీజిల్ మాన్యువల్ ఇంజిన్ ఏకంగా 23.22 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వడం విశేషం. డీజిల్ ఆటోమేటిక్ ఇంజిన్ 24.07 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం విశేషం. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూం ధర రూ.7.9 లక్షలుగా ఉండనుంది.