రాన్సమ్‌వేర్ అంటే ఏంటి? - తెలుసుకుంటే మీ ల్యాప్‌టాప్‌కే మంచిది!

Published by: Saketh Reddy Eleti
Image Source: Freepik

రాన్సమ్‌వేర్ అంటే ఒక రకమైన సైబర్ అటాక్. దీని ద్వారా హ్యాకర్లు మీ సిస్టంను లాక్ చేస్తారు.

Image Source: Freepik

వారు కోరినంత డబ్బు ఇస్తేనే అన్‌లాక్ చేస్తామని బెదిరిస్తారు.

Image Source: Freepik

మాల్‌వేర్ ద్వారా కంప్యూటర్‌లోకి ప్రవేశించి మీ కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తారు.

Image Source: Freepik

ఇలా ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను డిక్రిప్ట్ చేయకుండా యాక్సెస్ చేయలేం.

Image Source: Freepik

ఫైల్స్‌ను యాక్సెస్ చేయాలంటే బిట్ కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ద్వారా నగదు చెల్లించమని బెదిరిస్తారు.

Image Source: Freepik

ఎందుకంటే ఇలా నగదు చెల్లిస్తే దాన్ని ట్రేస్ చేయడం అసాధ్యం అన్నమాట.

Image Source: Freepik

ఫిషింగ్ మెయిల్స్, ఫేక్ లింక్స్ ద్వారా రాన్సమ్‌వేర్‌ని స్ప్రెడ్ చేస్తారు. వాటిని ఓపెన్ చేయగానే మాల్‌వేర్ యాక్టివ్ అవుతుంది.

Image Source: Freepik

పెద్ద సంస్థల సిస్టమ్స్‌ను లాక్ చేస్తే కోట్లలో డబ్బును హ్యాకర్లు డిమాండ్ చేస్తారు.

Image Source: Freepik

కాబట్టి మీ ల్యాప్‌టాప్‌ల్లో అనవసరమైన లింక్స్‌ను ఓపెన్ చేయకుండా ఉండటం మంచిది.

Image Source: Freepik