యూట్యూబ్‌లో లక్ష వ్యూస్‌కి ఎన్ని డబ్బులు వస్తాయి? ప్రస్తుతం మనదేశంలో యూట్యూబర్లు చాలా ఎక్కువ మంది అయ్యారు. యూట్యూబ్ ఛానెల్ మానిటైజేషన్ అయ్యాక యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యూట్యూబ్‌లో ఒక వీడియోకి లక్ష వ్యూస్ వస్తే 50 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ ఇన్‌కమ్ అనేది వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు? ఏ లొకేషన్ నుంచి వ్యూయర్స్ చూస్తున్నారు అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. యూట్యూబ్‌లో మీ ఛానెల్స్‌కు వచ్చే యాడ్ టైప్ కూడా మీ రెవిన్యూపై ప్రభావం చూపిస్తుంది. బంపర్, స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ ఇలా రకరకాల యాడ్లు యూట్యూబ్ వీడియోల్లో వస్తున్నాయి. వీడియో ఎంత నిడివి ఉంది? ఆడియన్స్ ఎంత సేపు చూస్తున్నారు అన్నదానిపై కూడా రెవిన్యూ ఆధారపడి ఉంటుంది. ఏ దేశం నుంచి చూస్తున్నారో కూడా ఇక్కడ ముఖ్యమే. అమెరికా, కెనడా, యూకే దేశాల నుంచి వ్యూస్ వస్తే మంచి రెవిన్యూ వస్తుంది.