రాహుల్ గాంధీ వాడే ఫోన్ ఏది? - దాని ధర ఎంత? ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వాడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా తెలపలేదు కానీ ఈ ఫోన్‌తో ఆయన చాలా సార్లు కనిపించారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో వెనకవైపు 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో ఏ17 ప్రో చిప్‌సెట్‌ను కంపెనీ అందించింది. దీంతో ఫోన్ చాలా వేగంగా పనిచేయనుంది. ఈ ఫోన్‌లో ఉన్న 5x టెలిఫొటో కెమెరా ద్వారా దూరంగా ఉన్న వస్తువులను కూడా చూడవచ్చు. ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఈ ఫోన్లలో యాపిల్ మొట్టమొదటిసారిగా యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు. ఈ ఫోన్ మంచి బ్యాటరీ లైఫ్‌ను కూడా అందించనుంది. దీని ధర ప్రస్తుతం మనదేశంలో రూ.1.28 లక్షల నుంచి ప్రారంభం కానుంది.