మీ స్మార్ట్‌ఫోన్ సంవత్సరం పాటు ఆన్ చేయకపోతే ఏం అవుతుంది? స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మనదేశంలో ఒక భాగం అయిపోయాయి. మన రోజువారీ జీవితంలో చాలా పనులు స్మార్ట్ ఫోన్‌లోనే చేస్తూ ఉంటాం. కానీ మీ మొబైల్ సంవత్సరం పాటు ఆన్ చేయకపోతే ఏం అవుతుందో తెలుసా? ఒకవేళ మీ ఫోన్ నెలపాటు ఆన్ చేయకపోతే అది ఆటోమేటిక్‌గా రీసెట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెల తర్వాత ఆఫ్ చేస్తే ప్రారంభంలో బ్యాటరీ బ్యాకప్ చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ ఏకంగా సంవత్సరం పాటు ఆఫ్ చేస్తే బ్యాటరీ పూర్తి డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది బ్యాటరీని బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మనం ఫోన్ వాడేటప్పుడు అప్పుడప్పుడు రీస్టార్ట్ చేయమని నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కానీ మీరు ఎక్కువకాలం ఆఫ్ చేస్తే అది పర్మినెంట్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది.