రిలయన్స్ జియో మనదేశంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఇటీవలే మొబైల్ నెట్‌వర్క్‌లు అన్నీ తమ ప్లాన్ల ధరలను పెంచాయి. దీంతో యూజర్లందరూ బీఎస్ఎన్ఎల్‌కు మారిపోవాలని చూస్తున్నారు. రిలయన్స్ జియో ఇటీవలే కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.949 కాగా... వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.949 ప్లాన్ ద్వారా యూజర్లకు రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా అందించనున్నారు. ఈ ప్లాన్‌తో కలిగే అదనపు లాభం ఏంటంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.