8 జీబీ ర్యామ్ ఉన్న 5జీ ఫోన్ రూ.12 వేలలోపే - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్! మోటొరోలా జీ45 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.