ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ సబ్‌మెరైన్ టైఫూన్ క్లాస్. ఈ సబ్‌మెరైన్‌ను 1980వ దశకంలో రష్యా డెవలప్ చేసింది. ఈ సబ్‌మెరైన్ ఎంత పవర్‌ఫుల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద సబ్‌మెరైన్‌కి ఎంతో పవర్, కెపాసిటీ ఉంది. టైఫూన్ క్లాస్ బరువు 48 వేల టన్నులుగా ఉంది. 20 బ్యాలిస్టిక్ మిసైల్స్‌ను మోయగల సామర్థ్యం ఈ సబ్‌మెరైన్‌కు ఉంది. ఒక్కో మిసైల్ 10 న్యూక్లియర్ వెపన్స్‌ను క్యారీ చేయగలదు. అంటే ఇది 200 న్యూక్లియర్ వెపన్స్‌ను క్యారీ చేయగలదన్న మాట. ఇది నీటిలో చాలా సైలెంట్‌గా ఉంటుంది. కాబట్టి దీన్ని శబ్దం ద్వారా ట్రేస్ చేయడం చాలా కష్టం. ఇది శత్రువులకు చాలా ప్రమాదకరం.