ఈ తప్పులు చేస్తే యూట్యూబ్ ఛానెల్ లేచిపోతుంది! ప్రస్తుతం యూట్యూబ్‌ను ఎందరో చూస్తున్నారు. దీంతో ఛానెళ్లు కూడా ఎక్కువయ్యాయి. అయితే యూజర్ రిపోర్ట్‌ల కారణంగా ఛానెల్స్‌పై యూట్యూబ్ యాక్షన్ తీసుకుంటుంది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘిస్తే యూట్యూబ్ ఛానెల్ ప్రమాదంలో పడుతుంది. కాపీ రైట్ రూల్స్ ఉల్లంఘించి యూట్యూబ్ ఛానెల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. ఛానెళ్ల ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడాన్ని యూట్యూబ్ ఇల్లీగల్‌గా పరిగణిస్తుంది. యూట్యూబ్ ఛానెల్ బ్యాన్ అయితే మీరు అందులో వీడియోలు పెట్టలేరు. ఈ విషయంలో యూట్యూబ్ నుంచి మెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విద్వేషపూరిత కంటెంట్ పెట్టినా మీ ఛానెల్ పోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానెల్ సేఫ్‌గా ఉండాలంటే ఇవి కచ్చితంగా పాటించాలి.