ఐఫోన్ 15 ప్రో మనదేశంలో 2023లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ రూ.98,000 కంటే తక్కువకే అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.1,05,999కు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా రూ.8,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది. దీంతో ఐఫోన్ 15 ప్రోపై ఏకంగా రూ.22 వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల డిస్‌ప్లేను కంపెనీ అందించింది. ఫోన్ వెనకవైపు 48 మెగాపిక్సెల్ సెన్సార్ సహా మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది.