‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.

2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు.

గతంలో బ్లాక్ పాంథర్‌గా కనిపించిన టి'చల్లా (చాడ్విక్ బోస్‌మన్) మరణంతో కథ మొదలవుతుంది.

వకాండా దేశంలో మాత్రమే లభించే అరుదైన, శక్తివంతమైన లోహం వైబ్రేనియం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

షురి బ్లాక్ పాంథర్‌గా ఎలా మారిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

టి'చల్లా మరణం వకాండాపై ఎంత ప్రభావం చూపించిందో తెలిపే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి.

విలన్ పాత్ర నమోర్ ఎంట్రీతో సినిమా ఊపందుకుంటుంది.

దర్శకుడు ర్యాన్ కూగ్లర్ యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోరుపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు.

‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ నిడివి 2 గంటల 44 నిమిషాలు. రన్ టైం కొంచెం తగ్గించుకుని ఉండాల్సింది.

ఏబీపీ దేశం రేటింగ్: 3/5
(All Images Credits: Marvel Studios)