కమెడియన్ వేణు టిల్లును దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు సంస్థ నిర్మించిన సినిమా 'బలగం'.

కథ : రెండు రోజుల్లో సాయిలు (ప్రియదర్శి) నిశ్చితార్థం. తాతయ్య మరణిస్తాడు. ఆ చావు దగ్గర గొడవలో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది.

కట్నం వస్తే అప్పు కట్టాలనుకున్న సాయిలు టెన్షన్ పడతాడు. మరోవైపు తండ్రి, మేనత్త భర్త మధ్య గొడవలు.

మరోవైపు పిండ ప్రదానం రోజున కాకి ముద్ద ముట్టదు. దాంతో ఊరికి అరిష్టమని పెద్దల పంచాయతీ.

గొడవకు కారణం ఏంటి? మేనత్త కుమార్తె సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)తో సాయిలు ప్రేమ కథ ఏమిటి? చివరకు ఏమైంది?

ఎలా ఉంది? : తెలంగాణ సంస్కృతి, యాస, భాషలకు పెద్ద పీట వేసిన సినిమా 'బలగం'.

'బలగం'లో కథ కొత్తది కాదు. కానీ, మన జీవితాల్లో చూసేది. మనలో భావోద్వేగాలను తట్టి లేపే చిత్రమిది.

సినిమా కొన్నిచోట్ల స్లోగా ఉన్నా, కథంతా ఓ పాయింట్ చుట్టూ తిరిగినా కామెడీ, ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి.

కాసర్ల శ్యామ్ సాహిత్యం, భీమ్స్ సంగీతం, రామ్ మిరియాల - మంగ్లీ గానం సినిమాకు ప్రాణం పోశాయి.

ఆర్టిస్టులు తమ పాత్రల్లో జీవించారు. తాతయ్యగా సుధాకర్ రెడ్డి కుమ్మేశారు. ప్రియదర్శి, కావ్యా కూడా!

తప్పకుండా చూడాల్సిన సినిమా 'బలగం'. బరువెక్కిన గుండెతో థియేటర్ల నుంచి ప్రేక్షకుడు బయటకు వచ్చేలా వేణు తీశారు.