విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఉగాది కానుకగా విడుదలైంది. కథ : కృష్ణదాస్ (విశ్వక్ సేన్) వెయిటర్. కీర్తీ (నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. తాను కోటీశ్వరుడినని అబద్ధం చెబుతాడు. కృష్ణదాస్ వెయిటర్ అని తెలిసి కీర్తి ఛీ కొడుతుంది. ఉద్యోగం పోతుంది. అద్దె కట్టలేదని ఓనర్ బయటకు గెంటేస్తాడు. సంజయ్ రుద్రలా యాక్ట్ చేయమని కృష్ణదాస్‌కు ఆఫర్ వస్తుంది. అతడిలా ఉండే సంజయ్ ఎవరు? తర్వాత ఏమైంది? అనేది కథ. ఎలా ఉంది? : నో లాజిక్స్, నో మేజిక్స్! ఓన్లీ కామెడీ అండ్ మేజిక్ మీద విశ్వక్ సేన్ నమ్ముకున్నారు. సినిమా చూస్తుంటే 'ధమాకా', 'ఖిలాడీ', 'గౌతమ్ నందా' గుర్తుకొస్తాయి. పాత చిత్రాలు మిక్సీలో వేసి తీసినట్టు ఉంటుంది. ఫస్టాఫ్ పర్వాలేదు. కామెడీ, లవ్ సీన్లతో సరదాగా ఉంటుంది. సెకండాఫ్‌లో యాక్షన్, థ్రిల్స్ ఆకట్టుకునేలా లేవు. దర్శకుడిగా టెక్నికల్ టీమ్ నుంచి విశ్వక్ మంచి అవుట్ పుట్ తీసుకొన్నాడు. కానీ, కథతో పాటు స్క్రీన్ ప్లేలో తడబడ్డారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్, రీ రికార్డింగ్ బావున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్, కెమెరా వర్క్ బావున్నాయి. హీరోగా విశ్వక్ సేన్ బాగా చేశాడు. క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపించాడు. నివేదా గ్లామర్ ఓకే. 'దాస్ కా ధమ్కీ' కొత్తగా ఉండదు. పాత సినిమాల్లో సీన్లు మళ్ళీ చూసినట్టు ఉంది. జస్ట్ ఏవరేజ్. (All Image Courtesy : Vanmayi Creations)