అల్లరి నరేష్ ‘ఉగ్రం’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? శివ కుమార్ (అల్లరి నరేష్) సిన్సియర్ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనలే ఉగ్రం. భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురు అనుకోకుండా మాయం అవుతారు. వారిద్దరూ ఏమయ్యారు అన్నది తెలియాలంటే ఉగ్రం చూడాల్సిందే. సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. మొదటి సీన్ నుంచే పూర్తిగా కథలోకి వెళ్లిపోయారు. అయితే కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాక సినిమా గాడి తప్పుతుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో, లవ్ ట్రాక్ అంత అనాసక్తికరంగా ఉంటాయి. ఏబీపీ దేశం: 2.75/5