గోపిచంద్ లేటెస్ట్ సినిమా ‘రామబాణం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన చివరి సినిమా ‘పక్కా కమర్షియల్’ నిరాశ పరిచింది. మరి ఈ ‘రామబాణం’ ఎలా ఉంది? రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముడు విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడే అన్నయ్యతో గొడవ పెట్టుకుని ఊరు వదిలి పారిపోతాడు. కోల్ కతాలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అనుకోకుండా ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. కానీ రొటీన్ టెంప్లేట్‌లో కథ సాగడం మైనస్ పాయింట్. ఏబీపీ దేశం రేటింగ్: 2/5