మొదటి సినిమా ‘స్వాతిముత్యం’తో మంచి పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ గణేష్. రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. ఐఫోన్ 12 కొనుక్కున్న సుబ్బారావు (బెల్లంకొండ గణేష్) దాన్ని కొన్నరోజే పోగొట్టుకుంటాడు. ఆ ఫోన్‌ను పోలీసులే దొంగిలించారని కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌కు (సముద్రఖని) కంప్లయింట్ ఇస్తాడు. ఆ ఫోన్ ఎక్కడికి పోయింది? సుబ్బు మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? వీటి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాకు తీసుకున్న కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. కానీ ప్రథమార్థంలో కథ అస్సలు ముందుకు కదలదు. ద్వితీయార్థంలో సునీల్ ఎంట్రీ ఇచ్చాక కథ పరుగులు పెడుతుంది. తీసుకున్న కాన్సెప్ట్‌ను సరిగ్గా రాసుకుని ఉంటే ఇది చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యేది. ఏబీపీ దేశం రేటింగ్ : 2.25/5