హార్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘1920 సిరీస్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సిరీస్‌లో ఐదో సినిమా ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ శుక్రవారం విడుదల అయింది. మేఘన (అవికా గోర్) తండ్రి ధీరజ్ (రణ్‌ధీర్ రాయ్) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తన చావుకు మేఘన తల్లి రాధిక (బర్కా బిష్ట్) కారణమని ఉత్తరం రాసి పెడతాడు. తల్లిపై పగ తీర్చుకోవాలని మేఘన నిర్ణయించుకుంటుంది. అందుకు చనిపోయిన తండ్రి సాయం కోరుతుంది. ‘1920 సిరీస్’లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే అత్యంత చెత్త సినిమా. సెట్ వర్క్, వీఎఫ్ఎక్స్ అన్ని విభాగాలూ పోటీ పడి మరీ వరస్ట్ అవుట్ పుట్ ఇచ్చాయి. హార్రర్ ఎలిమెంట్స్ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. అవికా గోర్ ఈ సినిమాలో లిప్ లాకులు, బెడ్రూం సీన్లలో నటించింది. ఏబీపీ దేశం రేటింగ్ : 1.5/5