తెలుగులో 'వరుణ్ డాక్టర్', 'డాన్' విజయాల తర్వాత 'మహావీరుడు'గా శివ కార్తికేయన్ వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? కథ : సత్య (శివకార్తికేయన్) పిరికివాడు. కార్టూన్స్ గీసుకోవడం, అడ్జస్ట్ అయ్యి బతకడం అతడికి అలవాటు. మురికివాడల్లో ఉన్న సత్య, జనాలను ఖాళీ చేయించి... ప్రభుత్వం కట్టించిన ఇళ్ళలో ఫ్లాట్స్ ఇప్పిస్తాడు మంత్రి. నాసిరకంగా కట్టిన భవనాలు కూలిపోతాయని సత్యకు ఓ అజ్ఞాత గొంతు చెబుతుంది. ఆ గొంతు ఎవరిది? కార్టూన్స్‌లో గీసినట్టు సత్య లైఫ్‌లో జరగడం ఏమిటి? భయాన్ని వీడి వీరుడిలా ఎలా మారాడు? అనేది సినిమా. ఎలా ఉందీ సినిమా : 'మహావీరుడు' కథ 'మర్యాద రామన్న'కు మరో వెర్షన్‌లా అనిపిస్తుంది. లెంగ్త్ ఎక్కువైంది. హీరో క్యారెక్టరైజేషన్, కాన్‌ఫ్లిక్ట్ బిల్డ్ చేయడానికి దర్శకుడు ఎక్కువ టైమ్ వేస్ట్ చేశారు. క్లైమాక్స్ సాగదీశారు. పాటలు తెలుగు ప్రేక్షకులకు గుర్తు ఉండవు. క్లైమాక్స్ వీఎఫ్ఎక్స్ అసలు బాలేదు. కామెడీ, ఫైట్స్ బావున్నాయి. రవితేజ వాయిస్‌కు శివ కార్తికేయన్ ఎక్స్‌ప్రెషన్స్, యోగిబాబు నటన నవ్విస్తాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కామెడీని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే లైట్.