పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ల 'బ్రో'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? సిన్మా ఎలా ఉంది? మినీ రివ్యూ చూడండి. కథ : మార్క్ (సాయి తేజ్)కు యాక్సిడెంట్ అవుతుంది. ఆత్మ ముందు టైమ్ (పవన్ కళ్యాణ్) ప్రత్యక్షం అవుతాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు తాను చూసుకుంటున్నాని, ఒకవేళ తాను లేకపోతే పరిస్థితి ఏంటని మార్క్ బాధపడతాడు. మార్‌కు 90 రోజుల టైమ్ ఇస్తాడు దేవుడు. భూమి మీదకు వచ్చిన ఆ 90 రోజుల్లో మార్క్ ఏం చేశాడు? అనేది సినిమా. ఎలా ఉంది? : తమిళ హిట్ 'వినోదయ సీతం' కథకు కమర్షియల్ హంగులు అద్ది తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. 'బ్రో' కథ, సందేశం కొత్తది కాదు. కానీ, చెప్పిన తీరు బావుంది. ఎమోషన్స్ ఇంకా వర్కవుట్ అయితే బావుండేది. 'బ్రో'కు బలం పవన్ కళ్యాణ్ నటన, పాటలు, ఆయన ఇమేజ్. స్క్రీన్ మీద పవన్ వచ్చిన ప్రతిసారీ ఓ హై వస్తుంది. పవన్ నటనలో హుషారు ఉంది. మాంచి ఎనర్జీతో కనిపించారు. అభిమానులకు వింటేజ్ పవన్ కనపడతారు. యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ బాడీ లాంగ్వేజ్‌లో మార్పు వచ్చింది. అది స్క్రీన్ మీద కనిపించింది. తమన్ పాటల కంటే నేపథ్య సంగీతం బావుంది. కేతిక, ప్రియ, రోహిణి తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. పవన్, సాయి తేజ్ కాంబినేషన్ సీన్స్ బావున్నాయ్! మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టే చిత్రమిది. పవన్ కోసం చూడొచ్చు.