'మహానటి', 'సీతా రామం'తో తెలుగులోనూ హిట్స్ కొట్టిన దుల్కర్ సల్మాన్... 'కింగ్ ఆఫ్ కొత్త'తో యాక్షన్ బాట పట్టారు.

కథ : 'కొత్త' టౌన్‌లో రాజు (దుల్కర్) రౌడీ. చెల్లెలు రీతూ (అనిఖ), తారా (ఐశ్వర్య) అంటే ప్రేమ. అతనిది హ్యాపీ లైఫ్!

సొంతూరిని, సొంత మనుషులను వదిలిపెట్టి రాజు లక్నో ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ ఎందుకు తిరికి వచ్చాడు?

తిరిగొచ్చిన తర్వాత ప్రాణ స్నేహితుడు కన్నా (షబీర్)తో యుద్ధం ఏమిటి? చివరకు ఏమైంది?

ఎలా ఉంది? : 'కింగ్ ఆఫ్ కొత్త'లో స్టైల్ ఉంది, యాక్షన్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. కానీ... 

'కింగ్ ఆఫ్ కొత్త'లోని అసలు కథలో బలమే లేదు. సాగదీత మరీ అంటే మరీ ఎక్కువ అయ్యింది. 

దుల్కర్ సల్మాన్ యాక్షన్ రోల్‌లో ఇరగదీశారు. ఆయన స్టైల్, నటన సూపర్. కొన్ని సీన్లలో హీరోయిజం భలే చూపించారు.

ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్, షబీర్ చక్కగా నటించారు. రితికా సింగ్ స్పెషల్ సాంగ్ చేశారు.  

జేక్స్ బిజోయ్ ఆర్ఆర్, నిమిష్ రవి కెమెరా వర్క్ బావున్నాయి. పాన్ ఇండియా మోజులో దర్శకుడు తప్పటడుగు వేశాడు. 

కథ లేనప్పుడు ఎన్ని హంగులు ఉన్నా ఏం ప్రయోజనం? బోర్ తప్ప! దుల్కర్ కోసం వెళ్ళండి! లేదంటే లైట్!