బాలీవుడ్ బాద్‌షా షారుక్ 2023 ప్రారంభంలోనే ‘పఠాన్’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ‘జవాన్’తో మళ్లీ వచ్చాడు. ఈ సినిమా కోసం దక్షిణాది ప్రముఖ డైరెక్టర్ అట్లీతో జత కట్టారు. గతం మర్చిపోయిన ఒక సైనికుడు (షారుక్ ఖాన్) దేశ సరిహద్దులోని గ్రామానికి చేరతాడు. 30 సంవత్సరాల తర్వాత అతను ముంబై మెట్రో హైజాక్ చేస్తాడు. బిజినెస్‌మ్యాన్ కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) దగ్గర నుంచి రూ.40 వేల కోట్లు వసూలు చేస్తాడు. తర్వాత ఏం అయింది? మధ్యలో జైలర్ (ఆజాద్) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో ఉన్న ఐదు ప్రధాన యాక్షన్ సన్నివేశాలు హైలెట్. అనిరుధ్ సంగీతం అద్భుతంగా ఉంది. కానీ అక్కడక్కడా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఏబీపీ దేశం రేటింగ్ : 3/5