మాస్ మహారాజ్ రవితేజ కొత్తవారిని ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు.

అలా నిర్మించిన క్రైమ్ కామెడీ థ్రిల్లరే ‘ఛాంగురే బంగారు రాజా’.

కథ విషయానికి వస్తే... దుగ్గాడ అనే గ్రామంలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) మెకానిక్ గా పని చేసుకుంటూ ఉంటాడు.

ఆ ఊర్లోనే ఉండే సోము నాయుడుని (రాజ్ తిరందాసు) ఎవరో హత్య చేసి చెరువులో పడేస్తారు.

ఆ నేరం బంగార్రాజు మీద పడుతుంది. దీని వల్ల బంగార్రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘ఛాంగురే బంగారు రాజా’ కథ చాలా చిన్నది. ఒక గొడవ, దాని తర్వాత ఒక హత్య, దాని వెనుక ఒక మిస్టరీ మొత్తంగా ఇదే కథ.

దీన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో దర్శకుడు సతీష్ వర్మ తడబడ్డారు.

సత్య, రవిబాబుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొన్ని హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి.

కానీ సస్పెన్స్ ఫ్యాక్టర్ వర్కవుట్ కాలేదు.

ఏబీపీ దేశం రేటింగ్ : 2/5