విశాల్, ఎస్‌జె సూర్య నటించిన 'మార్క్ ఆంటోనీ'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? మినీ రివ్యూలో చూడండి. 

కథ : గ్యాంగ్‌స్టర్స్ ఆంటోనీ (విశాల్), జాకీ (ఎస్‌జె సూర్య) ఫ్రెండ్స్. ఆంటోనీ, అతని భార్య మరణిస్తారు.

ఆంటోనీ కుమారుడు మార్క్ (విశాల్)ను జాకీ పెంచుతాడు. తల్లి కోరిక మేరకు గన్, కత్తి పట్టకుండా మెకానిక్ అవుతాడు మార్క్.

కాలంలో వెనక్కి ఫోన్ చేయగల ఫోన్ ద్వారా మార్క్ తెలుసుకున్న నిజం ఏమిటి? ఆ ఫోన్ కనిపెట్టింది ఎవరు?

మరణించిన ఆంటోనీ ఫోన్ కాల్ వల్ల మళ్ళీ ఎలా బతికాడు? జాకీ ఎలా చచ్చాడు? అసలు ఏమైంది? అనేది సినిమా.

ఎలా ఉంది? : 'మార్క్ ఆంటోనీ'లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ సీన్స్‌ను ఎలివేట్ చేసింది.

జాకీ, మార్తాండ పాత్రల్లో ఎస్‌జె సూర్య నటన అద్భుతం. ఆయన నవ్వించారు, నటనతో ఆకట్టుకున్నారు.

విశాల్ కొత్తగా కనిపించారు. నటనలోనూ వైవిధ్యం చూపించారు. రీతూ వర్మకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. 

'మార్క్ ఆంటోనీ' ఫస్టాఫ్ సరదాగా సాగింది. సెకండాఫ్ రిపీట్ & బోరింగ్ సీన్స్‌తో పేషెన్స్ టెస్ట్ చేసింది.

కామెడీ కోసం అయితే 'మార్క్ ఆంటోనీ'కి సరదాగా వెళ్ళవచ్చు. జస్ట్ టైమ్ పాస్ మూవీ.

Thanks for Reading. UP NEXT

శెట్టి పోలిశెట్టి మినీ రివ్యూ : అనుష్క సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story