బోయపాటి శ్రీను, రామ్ కలయికలో మొదటి సినిమా 'స్కంద'. ఇందులో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

కథ : పెళ్ళికి కొన్ని క్షణాల ముందు తెలంగాణ సీఎం కుమారుడితో ఏపీ సీఎం కుమార్తె లేచిపోతుంది.

లేచిపోయిన అమ్మాయిని తిరిగి తీసుకు రావడం కోసం కత్తిలాంటి కుర్రాడు (రామ్) ను పంపిస్తాడు.

ముఖ్యమంత్రులకు, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ రుద్రగంటి రామకృష్ణరాజు (శ్రీకాంత్) కేసుకు సంబంధం ఏమిటి?

రామ్ ఎవరు? తెలంగాణ సీఎం కుమార్తె (శ్రీలీల)తో ప్రేమ, అతని నేపథ్యం ఏమిటి? అనేది తెరపై చూడాలి.

ఎలా ఉంది? : బోయపాటి శ్రీను శైలి మాస్ అంశాలతో 'స్కంద' తెరకెక్కింది. స్టార్ టు ఎండ్... మాస్ జాతర!

'స్కంద'లో లాజిక్కులు, కథలో లూప్ హొల్స్ వెతికితే స్క్రీన్ మీద మేజిక్ అసలు ఎంజాయ్ చేయలేరు.

గెటప్స్, లుక్స్, డైలాగ్ మాడ్యులేషన్స్ పరంగా రామ్ వేరియేషన్ చూపించారు. యాక్షన్ అదరగొట్టారు.

యాక్షన్ సీన్లకు తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం స్పీకర్లు పగిలిపోవడం గ్యారెంటీ. సాంగ్స్ ఒకే.

బీభత్సమైన మాస్ యాక్షన్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మాత్రమే 'స్కంద'. మిగతా వాళ్లకు బెంగ తప్పదు!

Thanks for Reading. UP NEXT

సప్త సాగరాలు దాటి మినీ రివ్యూ : రక్షిత్ శెట్టి సినిమాలో ప్లస్, మైనస్‌లు

View next story