LCUలో లేటెస్ట్ ఫిల్మ్ 'లియో'. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తీసిన ఈ సినిమా ఎలా ఉంది? హైలైట్స్ ఏంటి? కథ : పార్తీబన్ (విజయ్), సత్య (త్రిష) దంపతులకు ఓ పాప, బాబు! వాళ్ళు హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటారు. పార్తీబన్‌ను వెతుకుతూ ఏపీ నుంచి ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) వస్తాడు. పార్తీబన్‌ను 'లియో' అంటాడు. తాను లియో కాదని పార్తీబన్ చెప్పినా ఆంటోనీ దాస్ అండ్ గ్యాంగ్ అసలు వినిపించుకోదు. లియో ఎవరు? నిజంగా లియో, పార్తీబన్ వేర్వేరు మనుషులా? ఒక్కటేనా? చివరికి ఏం తెలిసింది? అనేది కథ. ఎలా ఉంది? : పార్టులు పార్టులుగా చూస్తే 'లియో' బావుంటుంది. సినిమాగా చూస్తే ఏదో మిస్ అయిన ఫీలింగ్. 'లియో'ను LCUకి కనెక్ట్ చేశారు కానీ... ఒకవేళ చేయకపోయినా కథకు పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఫస్టాఫ్‌లో ఎంగేజింగ్‌గా ట్విస్టులతో నడిపారు. సెకండాఫ్‌లో ఒకే పాయింట్ దగ్గర ఆగడంతో సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. విజయ్, త్రిష బాగా చేశారు. సంజయ్ దత్, అర్జున్ సర్జాలను సరిగా వాడుకోలేదు. అనిరుధ్ మ్యూజిక్, మనోజ్ కెమెరా వర్క్ సూపర్. LCU అంచనాలు పక్కన పెడితే... యాక్షన్ ప్రియులకు 'లియో' నచ్చుతుంది. విజయ్ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి.