బాలకృష్ణ, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా గురువారం (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరంగల్ జైల్లో ఖైదీ నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ), జైలర్ కూతురు విజ్జీ పాప (శ్రీలీల) కథే ఈ సినిమా. వీరి జీవితంలోకి బిజినెస్‌మ్యాన్ రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) రావడంతో కథ మలుపులు తిరుగుతుంది. కేవలం పాత్రల పరిచయానికే అనిల్ రావిపూడి 40 నిమిషాల సమయం తీసుకున్నారు. ఇంటర్వెల్ సమయానికి అసలు కథ ప్రారంభం అవుతుంది. సెకండాఫ్‌లో ‘కళ్లలో కళ్లు పెట్టి చూడు’ పాట నేపథ్యంలో వచ్చే బస్ యాక్షన్ సీన్ కొత్తగా ఉంటుంది. క్లైమ్యాక్స్‌లో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఎమోషన్, యాక్షన్, ఎలివేషన్ల మధ్య స్క్రీన్‌ప్లే ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఏబీపీ దేశం రేటింగ్ : 2.75/5