దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన క్రైమ్ కామెడీ 'కీడా కోలా'. ఇందులో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? సినిమా ఎలా ఉంది? కథ : 'కీడా కోలా'లో బొద్దింక రావడంతో ఆ కంపెనీపై కేసు వేసి కోటి కొట్టేయాలని వాస్తు (చైతన్య), తాత వరదరాజులు (బ్రహ్మి) ప్లాన్ చేస్తారు. వాస్తు స్నేహితుడు కమ్ లాయర్ లాంచమ్ (రాగ్ మయూర్)ను 20 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చిన నాయుడు (తరుణ్ భాస్కర్) కిడ్నాప్ చేస్తాడు. నాయుడు అండ్ వాస్తు మెంబర్స్ కలిసి కీడా కోలా కంపెనీ నుంచి 5కోట్లు డిమాండ్ చేస్తారు. తర్వాత ఏమైందనేది సినిమా. ఎలా ఉంది? : చైతన్య, బ్రహ్మి క్యారెక్టర్లు స్పెషల్ డిజైన్ చేశారు. ఆ రేంజ్ సీన్స్ పడలేదు. వాళ్ళ కామెడీ సోసోగా ఉంది. చైతన్య, బ్రహ్మి కథగా మొదలైన 'కీడా కోలా'లో తర్వాత తరుణ్ భాస్కర్, జీవన్, రవీంద్ర విజయ్, రఘురామ్ వచ్చారు. సినిమాలో హైలైట్ అంటే తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ & ఆయన యాక్టింగ్! ఆయనలో నటుడిని బాగా ప్రజెంట్ చేశారు. కథగా చూస్తే 'కీడా కోలా'లో పెద్దగా విషయం ఏమీ కనిపించదు. టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవుట్ పుట్ ఇచ్చారు. బార్బీ బొమ్మతో తరుణ్ భాస్కర్ సీన్స్, మరికొన్ని కాసేపు నవ్విస్తాయి. కానీ, ఓవరాల్ కథ డిజప్పాయింట్ చేసింది. తరుణ్ భాస్కర్ నటన, కొంత కామెడీ కోసం అయితే వెళ్ళండి. ఆయన లాస్ట్ రెండు సినిమాల రేంజ్ అయితే కాదు.