'మా ఊరి పొలిమేర' ఓటీటీ సక్సెస్‌తో సీక్వెల్ 'పొలిమేర 2' తీశారు. ఇది హిట్టా? ఫట్టా? ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

కథ : జంగయ్య ఏమయ్యాడని జాస్తిపల్లికి కొత్తగా వచ్చిన రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.

జంగయ్య కోసం వెతికిన రవీంద్రకు కేరళలో కొమరయ్య (సత్యం రాజేష్) కనపడతాడు.

కేరళకు కవితను కాకుండా బలిజ (గెటప్ శ్రీను) భార్యను కొమరయ్య ఎందుకు తీసుకు వెళ్ళాడు?

కొమరయ్య చేసే పూజలకు, పొలిమేరలో గుడికి, కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధం ఏమిటనేది సినిమా.

ఎలా ఉంది? : 'మా ఊరి పొలిమేర' చూసేటప్పుడు షాక్, సర్‌ప్రైజ్ సీన్లు ఉంటాయి. 'పొలిమేర 2'లో అవి లేవు.

'పొలిమేర 2' ఫస్టాఫ్ సోసోగా ఉంది. సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథలోకి వెళ్ళలేదు.

సెకండాఫ్‌లో ట్విస్ట్‌లు ఎక్కువ ఉన్నాయి. ప్రేక్షకుల ఊహకు అందకుండా స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశారు.

'పొలిమేర 2'లో ట్విస్టులు బావున్నాయి తప్ప సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ప్రొడక్షన్ వేల్యూస్ బాలేదు.

అంచనాలు పెట్టుకోకుండా వెళితే 'పొలిమేర 2' ఓకే ఓకే అనిపిస్తుంది. 'మా ఊరి పొలిమేర' ఫ్యాన్స్‌ను శాటిస్‌ఫై చేస్తుంది.