మహిళల సెక్సువల్ ప్రాబ్లంపై 'మంగళవారం' తీశారు. పాయల్ సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి? చూడండి.

కథ: ఊరిలో మంగళవారం గోడపై అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంట పేర్లు, తర్వాత వాళ్ళ శవాలు కనిపిస్తాయి.

ఎవరో హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని ఎస్సై (నందిత శ్వేత) అనుమానం వ్యక్తం చేస్తుంది.

ఊరిలో హత్యలకు, కొన్నాళ్ల నుంచి కనిపించకుండా పోయిన శైలు (పాయల్)కు సంబంధం ఏమిటి?

ఊరి జమీందారు (చైతన్య కృష్ణ), ఆయన భార్య (దివ్యా పిళ్ళై), ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి) పాత్రలు ఏమిటి? అనేది సినిమా.

ఎలా ఉంది?: మహిళల సెక్యువల్ ప్రాబ్లంను అజయ్ భూపతి డిస్కస్ చేశారు. అందుకు ఆయన్ను మెచ్చుకోవాలి.

మర్డర్ మిస్టరీ కథగా మొదలైన 'మంగళవారం' తర్వాత రొమాంటిక్, మెస్సేజ్, రివెంజ్ డ్రామాగా మారుతుంది.

ఫస్టాఫ్‌లో కథ తక్కువ, ఆర్ఆర్ మెరుపులు ఎక్కువ. ఇంటర్వెల్ తర్వాత రొమాన్స్, ట్విస్టులు ఎక్కువ, థ్రిల్ తక్కువ!

పాయల్ గ్లామర్, యాక్టింగ్ సినిమాకు ప్లస్. డైరెక్షన్, మ్యూజిక్, కెమెరా వర్క్ సూపర్!

ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. కానీ, బోల్డ్ మెసేజ్ ఇచ్చిన సినిమా. హ్యాపీగా ఓ లుక్ వేయండి.