‘జిగర్తాండా డబుల్ఎక్స్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన ‘జిగర్తాండా’కు సీక్వెల్‌గా ఈ సినిమా విడుదల అయింది. ఎస్సై కావాలని అనుకోకుండా జైలు పాలవుతాడు కృప (ఎస్‌జే సూర్య). ఎలాగైనా సినిమా హీరో అవ్వాలనుకునే గ్యాంగ్‌స్టర్ అలియస్ సీజర్ (రాఘవ లారెన్స్). వీరిద్దరి మధ్యలో ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఫస్టాఫ్‌ను అద్భుతంగా తీశారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే హైలెట్ అన్నమాట. కానీ సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. చివరి 40 నిమిషాల్లో వచ్చే ఎమోషన్‌కు కనెక్ట్ అయితే సినిమా నచ్చేస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఏబీపీ దేశం రేటింగ్: 2.5/5