తేజ సజ్జ 'హనుమాన్'కు హిట్ టాక్ వచ్చింది. ప్రశాంత్ వర్మ తీసిన ఈ సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి? ఎలా ఉంది? కథ: హనుమంతు (తేజ సజ్జ) దొంగ. అతనికి దొరికిన రుధిర మణి వల్ల సూపర్ పవర్స్ వస్తాయి. హనుమంతు సూపర్ పవర్స్ గురించి ఓ వీడియోలో చూసిన మైఖేల్ (వినయ్ రాయ్) అంజనాద్రి వస్తాడు. హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయో తెలుసుకోవడంతో పాటు ఆ పవర్ సొంతం చేసుకోవాలని ట్రై చేస్తాడు. మైఖేల్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా? హనుమంతు, మీనాక్షి (అమృత), అంజమ్మ (వరలక్ష్మి) ఏం చేశారు? అనేది సినిమా. ఎలా ఉంది?: సూపర్ హీరో సినిమాలు ఒక టెంప్లేట్‌లో వెళతాయి. 'హనుమాన్' కూడా అంతే... రొటీన్ మూవీ. 'హనుమాన్' కథ, కథనాలు కొత్తగా లేవు. చిరంజీవి 'అంజి', ఇంకొన్ని సినిమా సీన్లు గుర్తుకు వస్తాయి. రొటీన్ కథైనా ప్రశాంత్ వర్మ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ అయ్యేలా సినిమా తీశారు. తేజ సజ్జతో పాటు నటీనటులు మంచి నటన కనబరిచారు. నిడివి ఎక్కువైన ఫీల్ కొన్నిసార్లు కలిగినా సినిమా మెప్పిస్తుంది. క్లైమాక్స్ 15 మినిట్స్ హనుమాన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రేక్షకుడిని 'హై'తో ఇంటికి పంపిస్తారు.