'సలార్'కు భారీ ఓపెనింగ్ లభించింది. ప్రభాస్ ఫాన్స్‌కు సినిమా నచ్చింది. ఇందులో ప్లస్, మైనస్‌లు ఏంటి? కథ: చిన్నప్పుడు 'ఖాన్సార్' వదిలేసిన దేవా (ప్రభాస్), మిత్రుడు వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) కోసం మళ్ళీ అడుగు పెడతాడు. ఖాన్సార్ రాజు రెండో భార్య కొడుకు వరద. అతడి అవమానాలు చూసి దేవా ఊచకోత మొదలు పెడతాడు. దేవా ఎవరెవర్ని చంపాడు? ఆద్య (శృతి హాసన్) ఎవరు? అసలు దేవా ఎవరు? అనేది వెండితెరపై చూడాలి. ఎలా ఉంది? 'సలార్' స్టార్టింగ్ టు ఎండింగ్ రెబల్ స్టార్ ర్యాంపేజ్ కనబడుతుంది. ఆయన హీరోయిజం బావుంది. కన్నడ హిట్ 'ఉగ్రం'కు రీమేక్ 'సలార్'. 'కెజియఫ్' ఫార్మటులో తీశారు. అందులో ఆ బ్యాక్ డ్రాప్, సెటప్ కొత్తగా కనిపించవు. 'కెజియఫ్' రేంజ్‌లో మ్యూజిక్ లేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ అలాగే ఉన్నాయి. ప్రభాస్ ఎలివేషన్స్, హీరోయిజం మీద పెట్టిన దృష్టి కథనం, ఇతర అంశాలపై ప్రశాంత్ నీల్ పెట్టలేదు. 'సలార్'లో యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. ప్రభాస్ హీరోయిజం పీక్స్‌లో ఉంది. ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్!