షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ తీసిన 'డంకీ'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? మినీ రివ్యూలో చూడండి. 

కథ: మను (తాప్సీ), ఆమె స్నేహితులు సమస్యల నుంచి గట్టెక్కడానికి లండన్ (ఇంగ్లీష్) వెళ్లాలని అనుకుంటారు.

వీసాలకు అవసరమైన డబ్బు లేదా ఇంగ్లీష్ చదువు మను & కో దగ్గర లేదు. దాంతో అక్రమ మార్గంలో వెళ్లాలని ట్రై చేస్తారు.

మను & గ్యాంగ్‌కి హార్డీ సింగ్ (షారుఖ్ ఖాన్) ఎందుకు సాయం చేశాడు? మనుతో అతని ప్రేమకు పునాది, సమాధి ఏమిటి?

అక్రమ మార్గంలో వెళ్ళిన హార్డీ, మను & కో ఎన్ని కష్టాలు పడ్డారు? హార్డీ ఇండియాకు ఎందుకు వచ్చాడు? అనేది సినిమా. 

ఎలా ఉంది?: రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు అన్నిటిలోకెల్లా క్లిష్టమైన కథ 'డంకీ'. కానీ, ఇందులో ఆయన టచ్, డెప్త్ లేదు.  

'డంకీ' కథలో వలసదారుల కష్టాలు, మధ్య తరగతి కన్నీళ్లు, సున్నితమైన హాస్యం ఉన్నాయి. కానీ, కథతో ప్రయాణం చేయడం కష్టం. 

షారుఖ్ ఖాన్ నటన బావుంది. పాటలు బావున్నాయి. ఊహకు అనుగుణంగా సినిమా వెళుతుంది.

భావోద్వేగాలు కదిలించేలా లేవు. కథలో భాగంగా లేవు. బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తాయి. జస్ట్ ఏవరేజ్ మూవీ ఇది.

'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్‌కు హ్యాట్రిక్ మిస్ అయితే... రాజ్ కుమార్ హిరాణీకి ఫస్ట్ ఫ్లాప్!