అన్వేషించండి

Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

Telangana Ration Card Security Features: తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థలో పారదర్శకత కోసం సరికొత్త స్మార్ట్‌ ఫుడ్ సెక్యూరిటీ కార్డును రూపొందించింది. ఇందులో ఉండే ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నకిలీ కార్డుల నిర్మూలనకు, నిజమైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు.
  • ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో కార్డులు ప్రారంభిస్తారు.
  • కార్డులో అత్యధునిక 9 రకాల భద్రతా ఫీచర్లు పొందుపరిచారు.

Telangana Ration Card Security Features: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒక చారిత్రాత్మక మార్పునకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, నకిలీ కార్డుల బెడదను శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం 'స్మార్ట్‌ సెక్యూరిటీ కార్డు'ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్ బియ్యం క్షేత్రస్థాయిలో ఉన్న నిజమైన నిరుపేద కుటుంబాలకు మాత్రమే అందాలి. గతంలో ఉన్న పేపర్‌ ఆధారిత లేదా సాధారణ ప్లాస్టిక్ కార్డుల స్థానంలో ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ స్మార్ట్‌ కార్డులు పంపిణీకానున్నాయి. 

ఎప్పుడు, ఎక్కడ, ఎవరి చేతుల మీదుగా లాంచ్ కానుంది?

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ వినూత్న కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే అధికారిక పతాకవిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా అందజేసి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తొలి విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు కార్డులు ఇచ్చి, తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని  జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

స్మార్ట్ కార్డు రూపకల్పనలో తీసుకొచ్చిన మార్పులేంటీ?

ఈ కొత్త రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ఇది చూడటానికి ఆధునిక డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఏటీఎం కార్డు మాదిరిగానే ఉంటుంది. కార్డుపై ఎడమవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుడివైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ముద్రించారు. కార్డుపై రేషన్ కార్డు నెంబర్‌, కుటుంబ యజమాని పేరు, చౌకధరల దుకాణం సంఖ్య, గ్రామం, మండలం, జిల్లా, ఇంటి చిరునామా వివరాలు స్పష్టంగా ఉంటాయి. కార్డుల్లో కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించడం ఒక కీలక అంశం. 

నకిలీలను నిరోధించే 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లు 

సాధారణ వ్యక్తులు ఈ కార్డును జిరాక్స్‌ చేయడం లేదా క్లోనింగ్ చేయడం అసాధ్యం అయ్యేలా, బ్యాంకు నోట్లు, పాస్‌పోర్టుల్లో వాడే అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. కార్డుపై ఉన్న గవర్నమెంట్ ఆప్ తెలంగాణ అనే అక్షరాలు సాధారణ ప్రింటింగ్‌లా కాకుండా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. కార్డును చేతితో తడిమినప్పుడు ఈ స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది. ఇది దృష్టి లోపం ఉన్నవారు కూడా కార్డు అసలైనదో కాదు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 

  • కార్డుపై అత్యంత సూక్ష్మ పరిమాణంలో అక్షరాలను ముద్రించారు. వీటిని కేవలం భూతద్ధం లేదా మైక్రోస్కోప్‌ ద్వారా మాత్రమే చూడగలం. ఈ అక్షరాలను డిజిటల్‌ స్కానర్లు కాపీ చేయలేవు. ఒక వేళ ఎవరైనా జిరాక్స్‌ తీయడానికి ప్రయత్నిస్తే, ఆ భాగం మసకగా లేదా కేవలం ఒక గీతలా మారిపోతుంది. 
  • ప్రతి కార్డు వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌ ఉంటుంది. ఇందులో లబ్ధిదారుడి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, సీరియస్‌ నంబర్, డిజిటల్ ఐడీ భద్రంగా ఉంటాయి. ఈ సమాచారాన్ని కేవలం పౌరసరఫరాల శాఖ సాఫ్ట్‌వేర్ మాత్రమే చదవగలదు. దీని వల్ల డేటా భద్రతకు ఎటువంటి ఢోకా ఉండదు. 
  • కార్డుపై సాధారణ కంటికి కనిపించని ఒక రహస్య గుర్తు ఉంటుంది. దీనిని అతినీలిలోహిత కాంతి కింద ఉంచినప్పుడు మాత్రమే ప్రభుత్వం చిహ్నం వెలుగులతో కనిపిస్తుంది. తనిఖీ అధికారులు కార్డును వేగంగా వెరిఫై చేయడానికి ఇది సహాయపడుతుంది. 
  • కార్డును కాంతికి లేదా వెలుతురుకు ఎదురుగా ఉంచి చూసినప్పుడు కార్డు లోపలి పొరల్లో ముద్రించిన తెలంగాణ ప్రభుత్వ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. 
  • తెలంగాణ ప్రభుత్వ అధికారిక ముద్రితతో కూడిన త్రీడీ హోలో గ్రామ్‌ కార్డుపై అతికించి ఉంటుంది. దీనిని తీసి వేరొక కార్డుకు మార్చడానికి లేదు. 
  • నిర్ధిష్ట కోణంలో చూసినప్పుడు మాత్రమే ఒరిజినల్‌ లేదా గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ అనే పదాలు కనిపించేలా రెండు చిత్రాలను పొందుపరిచారు. 
  • కార్డు జారీ చేసే అధికారి అయిన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డిజిటల్ సంతకాన్ని కార్డుపై అధికారిక ముద్రగా పొందుపరిచారు. 
  • కార్డు అంచుల్లో, లోపలి భాగంలో సంక్లిష్టమైన పేట్రన్ ఉపయోగించారు. ఇవి కార్డు ప్రామాణికత పెంచుతాయి. 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్‌ కార్డులు రాష్ట్ర సంక్షేమ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్నాయి. అయితే లబ్ధిదారుల తమ కార్డులపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ లేదా హోలోగ్రామ్‌ దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. కార్డు పోయినా లేదా ఇతర మార్పుల కోసం నేరుగా మీ సేవ లేదా తహసీల్దార్‌ కార్యాలయాన్ని మాత్రమే సంప్రదించాలి

Frequently Asked Questions

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సెక్యూరిటీ కార్డు ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

నకిలీ రేషన్ కార్డులను అరికట్టి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్ బియ్యం నిజమైన నిరుపేద కుటుంబాలకు మాత్రమే చేరేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

స్మార్ట్ సెక్యూరిటీ కార్డు పంపిణీ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమవుతుంది?

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డులను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రూపకల్పనలో ఏ మార్పులు చేశారు?

ఈ కార్డు ఆధునిక డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏటీఎం కార్డు మాదిరిగా ఉంటుంది. సీఎం, మంత్రి చిత్రాలతో పాటు రేషన్ నంబర్, కుటుంబ యజమాని (మహిళ), దుకాణం, చిరునామా వివరాలు స్పష్టంగా ముద్రించి ఉంటాయి.

స్మార్ట్ సెక్యూరిటీ కార్డు నకిలీలను ఎలా నిరోధిస్తుంది?

ఈ కార్డులో ఉబ్బెత్తు అక్షరాలు, మైక్రో-టెక్స్ట్, క్యూఆర్ కోడ్, UV గుర్తు, వాటర్‌మార్క్, 3D హోలోగ్రామ్ వంటి 9 రకాల అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లు పొందుపరిచారు. వీటిని జిరాక్స్ చేయడం లేదా క్లోనింగ్ చేయడం అసాధ్యం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
Kavitha Warns KTR: కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి.. నాతో పెట్టుకోకంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్
కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి.. నాతో పెట్టుకోకంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Embed widget