అన్వేషించండి

AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!

AP Ration Card eKYC: ఏపీలో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని చెబుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్మార్ట్ రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి, లేదంటే రేషన్ సరుకులు నిలిచిపోతాయి.
  • పారదర్శకత, అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేసింది.
  • ఈకేవైసీ చేయకుంటే బియ్యం, పింఛన్లు, ఇతర పథకాల లబ్ధి ఆగిపోవచ్చు.
  • రేషన్ డీలర్ వద్ద లేదా గ్రామ/వార్డు సచివాలయంలో ఆధార్ కార్డుతో ఈకేవైసీ పూర్తి చేయండి.

AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డుల వినియోగదారులు తమ ఈకేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే రేషన్ సరకులు నిలిచిపోవడమే కాకుండా కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో పారదర్శకతను పెంచడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గత ఏడాది ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. అయితే వాటికి సంబంధించిన లబ్ధిదారులు చాలా మంది ఇంకా వేలిముద్రలు, ఐరిస్‌ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. 

Also Read: డ్వాక్రా మహిళలకు 35 శాతం రాయితీతో రుణాలు.. పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!

నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలని, అనర్హుల పేర్లను తొలగించాలనే లక్ష్యంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తీసుకోవడానికే మాత్రమే కాకుండా పింఛన్, ఇతర సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాథమిక ప్రాతిపదికగా ఉంది. అందుకే డేటా అప్డేట్‌ అత్యంత కీలకం. 

Also Read: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!

ఈకేవైసీ చేయకుంటే ఏం జరుగుతుంది?

ఒక వేళ మీరు నిర్ణీత సమయంలో ఈకేవైసీ పూర్తి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి నెల అందే బియ్యం, ఇతర నిత్యావసర సరకులు సరఫరా ఆగిపోతుంది. ఈకేవైసీపీ పెండింగ్‌లో ఉన్న కార్డులను అధికారులు  అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. రేషన్ కార్డు ఆధారంగా వచ్చే తల్లికి వందనం, పింఛన్‌లు వంటి ఇతర ప్రభుత్వ పథకాల నగదు జమ ఆగిపోవచ్చు. ప్రభుత్వ రికార్డుల నుంచి లబ్ధిదారుడి పేరు శాశ్వతంగా తొలగించే ప్రమాదం ఉంది. 

Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!

ఈకేవైసీ ఎక్కడ, ఎలా పూర్తి చేయాలి?

లబ్ధిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. మీ పరిధిలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈపాస్ మెషిన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. కార్డులోని ప్రతి సభ్యుడు తమ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులు లేదా ఇతరులకు కొన్ని సార్లు వేలిముద్రలు పడవు. అటువంటి వారి ఐరిస్ స్కాన్ సహాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక వేళ రేషన్ షాపులో టెక్నికల్ సమస్య వస్తే సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. 

ఈకేవైసీ పూర్తి చేయాలంటే కావాల్సి పత్రాలు ఏంటీ?

ఈకేవైసీ పూర్తి చేయాలంటే మీతోపాటు కొన్ని పత్రాలు తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు, మీకు కేటాయించిన స్మార్ట్ రేషన్ కార్డు నెంబర్‌ ఇస్తే సరిపోతుంది. గత ఏడాది పాత కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన నాటి నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. కేవలం కార్డు ఉండటమే కాకుండా, లబ్ధిదారులు నిరంతరం రేషన్ సరుకులు తీసుకుంటూ ఉండాలని, తద్వారా వారు యాక్టివ్ యూజర్లుగా గుర్తింపు పొందుతారని ప్రభుత్వం సూచిస్తోంది. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్‌లో రేషన్ కార్డు డేటా అత్యంత కీలకమైంది. పథకాల అర్హుల జాబితాను ఈ డేటా ఆధారంగానే తీసుకుంటారు. అందుకే కార్డుదారులు తమ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మంచిది.

Frequently Asked Questions

స్మార్ట్ రేషన్ కార్డు ఈకేవైసీ ఎందుకు పూర్తి చేయాలి?

అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పెంచడం కోసం స్మార్ట్ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయాలి.

ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఏమవుతుంది?

ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకుల సరఫరా ఆగిపోతుంది, ఇతర సంక్షేమ పథకాల నగదు జమ ఆగిపోవచ్చు, కార్డు రద్దు అయ్యే ప్రమాదం ఉంది.

ఈకేవైసీ ఎక్కడ, ఎలా పూర్తి చేయాలి?

మీ పరిధిలోని రేషన్ డీలర్ వద్ద ఈపాస్ మెషిన్ ద్వారా లేదా సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలో ఈకేవైసీ పూర్తి చేయవచ్చు.

ఈకేవైసీ పూర్తి చేయడానికి ఏ పత్రాలు అవసరం?

ఈకేవైసీ పూర్తి చేయడానికి ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు మీ స్మార్ట్ రేషన్ కార్డు నెంబర్ అవసరం.

టాప్ హెడ్ లైన్స్

YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ప్రభావం.. గురువారం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీపై ఉపరితల ద్రోణి ప్రభావం.. గురువారం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
Crime Thriller OTT : ఒక్క రాత్రినే మలుపు తిప్పిన క్రైమ్ స్టోరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒక్క రాత్రినే మలుపు తిప్పిన క్రైమ్ స్టోరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget