అన్వేషించండి

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ ఏడాది సుమారు 78 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తల్లికి వందనం పథకం నిధులు త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
  • పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల చదువుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది.
  • ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి, ఆధార్, NPCI మ్యాపింగ్ తప్పనిసరి.

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నిధులు మరికొన్ని రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపకల్పన, నగదు జమ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ద్వారా ఈ ఏడాది లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది. 

78 లక్షల మంది అర్హులు 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థులను తల్లికి వందనం పథకానికి ప్రాథమికంగా అర్హులుగా తేల్చారు. పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను ఇప్పటికే క్రోడీకరించి, తుది వడపోత కోసం క్షేత్రస్థాయి అధికారులకు పంపారు. ప్రస్తుతం గ్రామ, వారు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులు ఈ వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 

ఈ తనిఖీ ప్రక్రియలో భాగంగా, విద్యార్థుల హాజరు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, ఇతర అర్హత ప్రమాణాలను సరి చూస్తున్నారు. అనర్హులను తొలగించి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ పరిశీలన సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదును విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాలలకు వెళ్లడం మానేయకూడదనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించడానికి, వారి విద్యా అవసరాల కోసం ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, డ్రాపౌట్స్‌ సంఖ్యను తగ్గించడానికి తీసుకున్న ఒక సామాజిక విప్లవం. 

ఖాతాల్లో డబ్బులు పడాలంటే మీరు చేయాల్సిన పనులు ఇవే !

తల్లికి వందనం నిధులు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నేరుగా ఖాతాల్లో జమ కావాలి అంటే లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి. అలా ఉందో లేదో చూడాలి. చాలా కాలం నుంచి లావాదేవీలు జరపని ఖాతాలు ఇన్ యాక్టివ్‌ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థి తల్లి బ్యాంక్‌ ఖాతాకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కీలకమైన అంశం. ప్రభుత్వ పథకాల నగదు డైరెక్ట్‌గా బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అందాలంటే, ఖాతాకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. పాఠశాల రికార్డుల్లో, సచివాలయ డేటాలో విద్యార్థి, తల్లి వివరాలు ఒకే విధంగా ఉండాలి. 

తల్లిదండ్రులు తమ వివరాలను లేదా ఎన్‌పీసీఐ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 

గత ఏడాది వివరాలు పరిశీలిస్తే...

 గత ఆర్థిక సంవత్సరం ఏపీ ప్రభుత్వం సుమా౩రు రూ. 8, 711 కోట్లను విద్యార్థుల కుటుంబాల ఖాతాల్లో జమ చేసింది. ఈ భారీ మొత్తం రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లేదా అంత కంటే ఎక్కువ మొత్తంలో నిధుల విడుదల  చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది?

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయకూడదని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కోసం ఈ పథకం ఉద్దేశించబడింది. తల్లిదండ్రులను ప్రోత్సహించి, పిల్లల విద్యా అవసరాలకు ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.

ఈ ఏడాది తల్లికి వందనం పథకానికి ఎంతమంది విద్యార్థులు అర్హులుగా గుర్తించారు?

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థులను తల్లికి వందనం పథకానికి ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు.

తల్లికి వందనం నిధులు నేరుగా ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలి?

బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి, తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి, మరియు NPCI మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. పాఠశాల, సచివాలయ డేటాలో విద్యార్థి, తల్లి వివరాలు సరిగ్గా ఉండాలి.

గత ఏడాది తల్లికి వందనం పథకం కింద ఎంత మొత్తం జమ చేశారు?

గత ఆర్థిక సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ. 8,711 కోట్లను విద్యార్థుల కుటుంబాల ఖాతాల్లో జమ చేసింది. ఇది లక్షలాది మంది విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో సహాయపడింది.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Tension in Punganur: పుంగనూరు, రాయచోటిలో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
పుంగనూరు, రాయచోటిలో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget