అన్వేషించండి

MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Congress MLA Premsagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బ్యాంకుల వద్ద తీసుకున్న లోన్లను 2015లోనే తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రేమ్ సాగర్ రావు ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలను ఖండించారు.
  • గూడెం ఆలయం, రూ.250 కోట్ల ఆసుపత్రి పనులు పురోగతిలో.
  • ఎల్లంపల్లి నుండి గూడెం పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు.
  • మంచిర్యాల గ్రేడ్-1 కార్పొరేషన్‌గా మారే ప్రతిపాదనలు సిద్ధం.

Mancherial Latest News | మంచిర్యాల: తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధినే సహించలేక ప్రతిపక్ష నేతలు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. మంచిర్యాల పట్టణంలోని ఒక హాలులో మేయర్ దర్ని మధుకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. రూ. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థాన నిర్మాణం, రూ. 4.94 కోట్లతో విశ్వనాథ ఆలయాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల లోపే గూడెం ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, ఎల్లంపల్లి నుండి గూడెం గోదావరి వరకు ఎకో టూరిజం, బోటింగ్, యానిమల్ సఫారీ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 

ఐపీఎస్ వందసార్లు చెబితే అబద్ధం నిజం అయిపోతుందా..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాళ్ళవాగు వద్ద తాగునీటి పైప్‌లైన్ ధ్వంసమైందని, వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో వెంటనే మరమ్మతులు చేయడం వీలుకాలేదని చెప్పారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి, సాధ్యమైనంత త్వరగా మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాను రూ. 450 కోట్లు అప్పు తీసుకుని అవినీతికి పాల్పడ్డానంటూ బిఆర్ఎస్, బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ తాను వివిధ బ్యాంకుల నుంచి రూ. 109.11 కోట్లు మాత్రమే అప్పు తీసుకుని, 2015 ఏప్రిల్ 15 నాటికే వాటిని పూర్తిగా చెల్లించానని స్పష్టం చేశారు. ఐపీఎస్ పాస్ అయిన వ్యక్తి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం అనిపించేలా ప్రయత్నిస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు విమర్శించారు. తనకున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాకి లెక్కలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వీటిని నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు, ఆరోపణలకు కౌంటర్
తాను ఎమ్మెల్యే అయ్యాక భారీ సంపాదించి బ్యాంకులకు లోన్లు తిరిగి చెల్లించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తనపై అవినీతి, అధికార దుర్వినయోగం ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. వివిధ బ్యాంకుల నుండి భారీగా అప్పు తీసుకుని అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ తాను తీసుకున్నది రూ. 109.11 కోట్ల అప్పు అని, గతంలో తీసుకున్న ఆ బకాయిలను 2015 ఏప్రిల్ 15 నాటికే బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసినంత మాత్రాన నియోజవర్గంలో అభివృద్ధి అడ్డుకోలేరని, ప్రజలు అన్నీ గమనిస్తూరంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేసి మంచిర్యాలను గ్రేడ్-1 మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రూ. 250 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కూడా కొనసాగుతోంది.

Frequently Asked Questions

ప్రేమ్ సాగర్ రావుపై ప్రతిపక్షాలు చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

బిఆర్ఎస్, బిజెపి నాయకులు ప్రేమ్ సాగర్ రావు రూ. 450 కోట్లు అప్పు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, ఆయన రూ. 109.11 కోట్లు మాత్రమే తీసుకుని, వాటిని ఏప్రిల్ 15, 2015 నాటికి పూర్తిగా చెల్లించినట్లు స్పష్టం చేశారు.

మంచిర్యాలలో కొనసాగుతున్న కొన్ని ప్రధాన అభివృద్ధి పనులు ఏమిటి?

రూ. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం, రూ. 4.94 కోట్లతో విశ్వనాథ ఆలయాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ. 250 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణంలో ఉన్నాయి.

మంచిర్యాలలో తాగునీటి సరఫరాకు ఎందుకు అంతరాయం ఏర్పడింది?

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాళ్ళవాగు వద్ద తాగునీటి పైప్‌లైన్ ధ్వంసమైంది. వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో మరమ్మతులు చేయడం ఆలస్యమైంది. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి సరఫరాను పునరుద్ధరిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget