Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
క్రికెట్ అభిమానులకు ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ తెలిపింది. 'ఉమెన్స్ టి20 ఆసియా కప్ 2026' షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ దుబాయ్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు అత్యంత ఉత్కంఠభరితంగా జరగనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ టీమ్‌లు గ్రూప్-ఎ లో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, యూఏఈ జట్లు గ్రూప్-బి లో ఉన్నాయి.
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఆగస్టు 30న థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో తలపడనుంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ సెప్టెంబర్ 5న జరగనుంది.
టోర్నమెంట్‌లోని మొత్తం 15 మ్యాచ్‌లూ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో డే-నైట్ మ్యాచ్‌లుగా జరగనున్నాయి. ఈ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకునేందుకు హర్మన్ సేన పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















