అన్వేషించండి

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

పోక్సో కేసుతో పాటు నిధుల మళ్లింపు ఆరోపణలతో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో విష్ణు కుమార్ గౌడ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రుధ్వీశ్వర్ రెడ్డి సస్పెండ్.
  • పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద ఆయనపై కేసు నమోదైంది.
  • నిధుల మళ్లింపు, క్రీడాకారుల భద్రత ఉల్లంఘన ఆరోపణలూ ఉన్నాయి.
  • పోలీసు దర్యాప్తు తీరుపై బాధితురాలి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Telangana Basketball Association | హైదరాబాద్: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్  (TBA) జనరల్ సెక్రటరీ ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. 16 ఏళ్ల జాతీయ స్థాయి మైనర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పృథ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఆరోపణలతో ఆగస్టు 7న జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సమావేశమై చర్చించింది. జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో జాయింట్ సెక్రటరీ విష్ణు కుమార్ గౌడ్‌కు జనరల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

లైంగిక వేధింపుల కేసుతో పాటు, క్రీడాకారుల భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు పృథ్వీశ్వర్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళా కోచ్ లేదా మేనేజర్ లేకుండానే మైనర్ బాలికల జాతీయ జట్టును టోర్నమెంట్‌కు తీసుకెళ్లడం, మహిళా క్రీడాకారిణులు, కోచ్‌ల నుంచి వచ్చిన ఫిర్యాదులను బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) తీవ్రంగా పరిగణించింది. దీనికి తోడు TBA లీగ్‌ల నిర్వహణలో నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ ఆరోపణలు, నలుగురు క్రీడాకారిణులకు BFI నుంచి అందాల్సిన నగదు బదిలీ కాకపోవడం, ట్రెజరర్ చంద్రశేఖర్ క్రీడాకారిణుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి పలు వ్యవహారాలు క్రీడా సమాఖ్యలో చర్చ జరిగింది. 

మరోవైపు పోలీసుల దర్యాప్తు తీరుపై బాధిత కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తీవ్రమైన పోక్సో ఆరోపణలు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబం DGPతో పాటు ఉన్నత పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందించింది. క్రీడా సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటుండగా, పోలీసులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రస్తుతం BFI తదుపరి చర్యలు, దర్యాప్తుపై క్రీడా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

టీబీఏ జనరల్ సెక్రటరీ ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 16 ఏళ్ల మైనర్ మహిళా బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నంబర్ 1105/2026 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత  సెక్షన్ 75(1)(iv) తో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSO)లోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే అతడ్ని అరెస్ట్ చేసి విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  

 

 

Frequently Asked Questions

తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై ఎందుకు సస్పెన్షన్ వేటు పడింది?

16 ఏళ్ల మైనర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, పోక్సో కేసు నమోదు కావడంతో ప్రుధ్వీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఆర్థిక ఆరోపణలు, క్రీడాకారుల భద్రతా నియమాలు ఉల్లంఘించడం కూడా దీనికి కారణం.

ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి?

ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 తో పాటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75(1)(iv) కింద కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రుధ్వీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత అతని స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

ప్రుధ్వీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం, జాయింట్ సెక్రటరీ విష్ణు కుమార్ గౌడ్‌కు జనరల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఆగస్టు 7న జరిగిన ప్రత్యేక సమావేశంలో తీసుకున్నారు.

ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కాకుండా ఇతర ఆరోపణలు ఏమైనా ఉన్నాయా?

అవును, TBA లీగ్‌ల నిర్వహణలో నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. అలాగే క్రీడాకారుల భద్రతా నియమాలు ఉల్లంఘించినట్లు కూడా ఆరోపణలున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget