అన్వేషించండి

Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?

Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్‌ల్లో ఒకే పాస్‌తో ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త పాస్ తీసుకురాబోతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ విధానం అమలు చేయనున్నాయి.
  • ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులలో సౌకర్యంగా ప్రయాణించవచ్చు.
  • ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించి, ఛార్జీల భారం తగ్గడమే లక్ష్యం.
  • పాస్ ధరలు, అమలుపై త్వరలో నిర్ణయం తీసుకొనున్నారు.

Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్తను ఒకే తాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కీలక ముందడుగు వేశాయి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కామన్‌ పాస్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం హైదరాబాద్‌ నగర రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. 

ఏంటీ ఈ కామన్‌ పాస్‌?

ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులకు, మెట్రో రైళ్లకు వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో ఒకే పాస్‌తో మెట్రో రైళ్లు, నగరంలోని వివిధ రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, మెట్రో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు ఈ కార్యాచరణను వేగవంతం చేశారు. ఇటీవల బస్ భవన్‌లో ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌ అండ‌ టీ మెట్రో అధికారులు సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ కామన్ పాస్ విధానం వెనుక ప్రధానంగా మూడు లక్ష్యాలు ఉన్నాయి. ప్రయాణికులు ఆర్టీసీ బస్ దిగి మెట్రో ఎక్కేటప్పుడు లేదా మెట్రో నుంచి బస్‌కు మారేటప్పుడు పదే పదే టికెట్లు తీసుకోవాల్సి అవసరం ఉండదు. వేర్వరుగా పాస్‌లు తీసుకోవడం కంటే ఒకే పాస్ ఉండం వల్ల ప్రయాణికులకు ఛార్జీల భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజూ 22 లక్షల మంది బస్సుల్లో4.7 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఉమ్మడి పాస్‌లు వస్తే  సంఖ్య మరింత పెరగవచ్చు. 

ఎప్పటి నుంచి అమల్లోకి?

ప్రస్తుతానికి దీనిపై ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి పాస్‌ల ఛార్జీల నిర్ధారణ, పాస్‌ల రూపకల్పనపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వారంలోనే HUMTA ప్రతిపాదించిన ఉమ్మడి మొబైల్ యాప్ గురించి, ఛార్జీల గురించి మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ధరలపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ పాస్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఎలా పని చేస్తుంది?

ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న డైలీ, మంత్లీ పాస్‌లనే మెట్రోకు కూడా వర్తింపజేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అదనంగా ఇప్పటి వరకు లేని వీక్లీ పాస్‌ సౌకర్యాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్టీనరీ బస్‌లకు నెలకు 1600, మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు నెలకు 1800, మెట్రో డీలక్స్‌కు 2200, డైలీ పాస్‌ 150 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. 

కామన్ పాస్ విధానం వస్తే, మెట్రోరైళ్లతోపాటు  ఈ మూడు రకాల బస్‌లలోనూ ఒకే పాస్‌తో ప్రయాణించవచ్చు. అయితే మెట్రో రైళ్లకు మాత్రమే పరిమితమయ్యేలా డైలీ, వీక్లీ, మంత్లీ పాస్‌లను కూడా ప్రత్యేకంగా తీసుకురానున్నారు. 

Frequently Asked Questions

ఈ కామన్ పాస్ విధానం ఏమిటి?

మెట్రో రైళ్లు, నగరంలోని వివిధ రకాల ఆర్టీసీ బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించవచ్చు. మెట్రో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు ఆర్టీసీని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

కామన్ పాస్ ప్రవేశపెట్టడం వెనుక లక్ష్యాలు ఏమిటి?

ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడం. పదే పదే టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఛార్జీల భారం తగ్గించడమే ప్రధాన లక్ష్యం.

కామన్ పాస్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ప్రస్తుతం దీనిపై ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఛార్జీల నిర్ధారణ, పాస్‌ల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ధరలపై స్పష్టత వచ్చాక త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

కామన్ పాస్ విధానంలో ఏ రకాల పాస్‌లు ఉంటాయి?

ఆర్టీసీలో ఉన్న డైలీ, మంత్లీ పాస్‌లతో పాటు కొత్తగా వీక్లీ పాస్‌ సౌకర్యాన్ని ప్రవేశపెడతారు. మెట్రో రైళ్లతోపాటు మూడు రకాల బస్సుల్లోనూ ఒకే పాస్‌తో ప్రయాణించవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget