అన్వేషించండి

YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!

YS Sharmila Demands Apology: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల పెళ్లి పత్రిక అందించడంపై ఓ పత్రిక చెట్టాపట్టాల్ అంటూ కథనం రాసింది. ఈ వార్తపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • షర్మిల కుమార్తె వివాహ ఆహ్వానంపై కథనంపై తీవ్ర ఆగ్రహం.
  • కథనం వ్యక్తిత్వ హననం, వైసీపీ సంస్కృతి పరాకాష్ట అని ఖండించింది.
  • జగన్ స్పష్టతనిచ్చి, పత్రిక క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్.
  • మంత్రి లోకేశ్ కథనాన్ని ఖండించి, షర్మిలకు మద్దతునిచ్చారు.

 YS Sharmila Demands Apology: ఏపీ రాజకీయాల్లో మరోసారి మీడియా కథనాలపై తీవ్ర దుమారం రేగింది. తన కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబుకు శుభలేఖ అందించడంపై ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనం తనకు, తన కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననమని పేర్కొంటూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయనకు చెందిన పత్రికా యాజమాన్యంపై నిప్పులు చెరిగారు.

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే తప్పుడు అర్థాలా?

ఆ న్యూస్ పేపర్ కథనంలోని పదాలను ప్రస్తావిస్తూ వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే 'చెట్టాపట్టాల్' అంటారా? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా?" అని ఆమె ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి నీలాప నిందలు వేయడం వైసీపీ దిగజారుడు సంస్కారానికి పరాకాష్ట అని ఆమె మండిపడ్డారు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అచ్చం 'కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే' అని ఎద్దేవా చేశారు.

ఆనాడు వైఎస్సార్ కూడా చంద్రబాబును ఆహ్వానించారు కదా!

ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావనను షర్మిల తీసుకొచ్చారు. "ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబును వైఎస్సార్ ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగినట్లా? చంద్రబాబు.. ఆ పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

వైఎస్ జగన్‌కు సూటి ప్రశ్నలు  

మహిళల గౌరవం, సాధికారత గురించి మాట్లాడే వైఎస్ జగన్ ఈ కథనంపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రికలో ఇలాంటి వార్తను ఎలా సమర్థించుకుంటారు? తల్లి, చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాయించడమే మీ అజెండానా? ఈ కథనాన్ని మీరే దగ్గరుండి రాయించారా? అని ఆమె జగన్‌ను ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు రాతలు రాయించినందుకు వైఎస్ జగన్ స్వయంగా సంజాయిషీ ఇస్తారా, లేక ఆ పత్రిక ద్వారా క్షమాపణ చెప్పిస్తారా? తేల్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

స్పందించిన మంత్రి లోకేశ్ 

ఈ కథనంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "కూతురి పెళ్లికి తమకంటే పెద్దవారిని ఆహ్వానించడం మర్యాద, సంస్కృతికి సంబంధించిన విషయం. సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల ఆహ్వానించినట్లుగా ఓ పేపర్ లో వచ్చిన కథనం ఒక మహిళను తీవ్రంగా కించపరిచేదిగా ఉంది. అవి ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. ప్రజా జీవితంలో బలమైన రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ అది తన ప్రాథమిక విలువలను ఎన్నడూ కోల్పోకూడదు. ఏపీలో ఒక మహిళపై వ్యక్తిగత దాడులకు తావు లేదు. ఈ పేపర్ వారి బాధ్యతారహితమైన కథనాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని లోకేశ్ ట్వీట్ చేశారు. 

Frequently Asked Questions

వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి?

తన కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబుకు శుభలేఖ అందించడంపై ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై షర్మిల మండిపడ్డారు. ఆ కథనం తన, తన కుటుంబానికి వ్యక్తిత్వ హననం అని పేర్కొన్నారు.

దినపత్రిక కథనంపై షర్మిల లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు ఏమిటి?

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే 'చెట్టాపట్టాల్' అని రాయడం సరికాదని షర్మిల అన్నారు. ఇది వావి వరసలు లేని సంస్కారమని, బురద రాతలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంలో వైఎస్ జగన్‌ను షర్మిల ఎలా ప్రశ్నించారు?

మహిళల గౌరవం గురించి మాట్లాడే జగన్, ఆయన పత్రికలో ఇలాంటి వార్తను ఎలా సమర్థిస్తారని షర్మిల ప్రశ్నించారు. ఈ తప్పుడు రాతలకు సంజాయిషీ ఇవ్వాలని లేదా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కథనంపై మంత్రి లోకేశ్ ఎలా స్పందించారు?

కూతురి పెళ్లికి పెద్దలను ఆహ్వానించడం సంస్కృతి అని లోకేశ్ అన్నారు. ఈ కథనం మహిళను కించపరిచేలా ఉందని, వ్యక్తిగత దాడులు ఆమోదయోగ్యం కావని ఆయన ఖండించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
Travis Head Exit:  SRH అభిమానులకు హెడ్ షాక్ .. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
SRH అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన హెడ్.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
Embed widget